Cyber Ganesha Cyber Safety
* సైబర్ నేరాల నివారణపై వెబ్పోస్టర్
* అవగాహన కల్పిస్తూ ప్రచారం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గణపతి నవరాత్రుల వేళ.. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వినూత్న ప్రచారానికి అధికారులు శ్రీకారం చుట్టారు. కేంద్ర కమ్యూనికేషన్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వారి సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ – డాక్) హైదరాబాద్ శాఖ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (ఐఎస్ఈఏ) ప్రాజెక్టు నిపుణులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
సైబర్ నేరాల నివారణపై రూపొందించిన సైబర్ గణేశా టెన్ డిజిటల్ సేఫ్టీ మంత్రాస్/ సూచనల వెబ్ పోస్టర్‌ను విడుదల చేశారు. వీటిని మండపాల వద్ద ప్రదర్శించి, నేరాల నివారణకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు.
* సైబర్ గణేష్ ఏం చెబుతున్నారంటే..
ఈ వెబ్ పోస్టర్లో విఘ్నేశ్వరుడు సైబర్ భద్రత, సంరక్షణలకు పది సూచనలు చేస్తున్నట్లు వెబ్ పోస్టర్లు రూపొందించారు.
* అపరిచిత వ్యక్తుల, సైట్స్ లింక్స్‌పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి
* ఓటీపీ/పిన్ నెం. ఎవరితోనూ షేర్చేయకండి
* ఏఐ వాయిస్ కాల్స్‌ను ధృవీకరించుకోవాలి
* డిజిటల్ అరెస్టు ఒక స్కామ్/ మోసం అని గుర్తుంచుకోవాలి
* బలమైన పాస్ వర్డ్స్ వాడాలి
* రెండు స్టెప్స్‌లో ధృవీకరణ/వెరిఫికేషన్ ఉండేలా చూసుకోండి
* ధృవీకరించిన యాప్స్‌నే డౌన్లోడ్ చేసుకోవాలి
* స్కాన్ చేసే ముందు చెక్ చేసుకోవాలి
* గోప్యతను కాపాడుకోవాలి/ సంరక్షించుకోవాలి
* 1930కు ఫిర్యాదు చేయాలి..
అపరచితులు కాల్ చేసి బ్యాంకు ఖాతాలు, పిన్ నెం. ఓటీపీ తదితర వ్యక్తిగత సమాచారం సేకరించి, డబ్బు కాజేసే సైబర్ మోసాలకు పాల్పడే ప్రమాదాన్ని గుర్తుంచాలని సీ డాక్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ ఏఎస్ మూర్తి సూచించారు. డిజిటల్ అరెస్టు ఫ్రాడ్స్టర్స్ మోసం చేసేందుకు వాడే బెదిరింపు అని తెలుసుకోవాలని, వీడియో కాల్స్ చేసి అలా బెదిరింపులకు దిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మరింత సమాచారం. ఠీఠీఠీ.ట్ట్చడట్చజ్ఛౌుఽజూజీుఽ్ఛ.జీుఽ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. సైబర్ మోసాల నివారణకు, అవగాహనకు సీ డాక్ నిరంతరం సూచనలు, వెబ్ సోస్టర్లు తక్కువ నిడివి వీడియోలు రూపొందిస్తోందన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
