Vaishnavi Case
- నడిరోడ్డుపై భర్త హరిబాబు హత్య
- కారులో వచ్చి కత్తులతో దాడి..
ఆకేరు న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తాలో హరిబాబు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై అతడిపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
వైష్ణవి కేసుతో సంబంధం?
హరిబాబు గతంలో హత్యకు గురైన యూట్యూబర్ వైష్ణవి కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత కక్షలే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రతీకార హత్య అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైష్ణవి అన్నలే ఈ హత్యకు పాల్పడ్డారనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.
ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
