Hatah Teaser
Hatah Teaser: ఆకేరు న్యూస్, హైదరాబాద్: హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ మూవీ ‘హతః టీజర్ విడుదలైంది. కేఏ ప్రొడక్షన్స్ పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు. శివశంకర నాయుడు. వై నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
* మిస్టికల్ థ్రిల్లర్‌గా..
హతః మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోందని దర్శకుడు అనుష్ గోరక్ తెలిపారు. హారర్‌తో పాటు పలు జానర్ల అంశాలు సినిమాలో ఉంటాయని కథలో ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయని చెప్పారు. వాటిని థియేటర్లలో ప్రేక్షకులు అనుభవించాలని అన్నారు.
* ప్రతి సీన్లో సర్ప్రైజ్
ఈ సినిమా తనకు ప్రత్యేకమైనదని కిరణ్ అబ్బవరం తెలిపారు. ప్రతి సీన్ తర్వాత ఏం జరుగుతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుందని, క్లైమాక్స్ వరకు కథ ఆకట్టుకుంటుందని చెప్పారు. ఎడిటింగ్, మ్యూజిక్, విజువల్స్‌తో పాటు నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా సర్ప్రైజ్ చేస్తుందని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో రెహమాన్, కుష్లు, తనూజ పుట్టుస్వామి, నమ్రిత ఎంవీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అఖిల్ చక్రవర్తి ఎడిటింగ్, జేసిన్ జార్జ్ సంగీతం, అనుష్ గోరక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
