Former NHAI PD
* రూ.1.25 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ NHAI మాజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గొల్ల దుర్గాప్రసాద్‌పై సీబీఐ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. దుర్గాప్రసాద్‌కు సంబంధించిన ఆస్తులపై విచారణ చేపట్టిన అధికారులు.. కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూములు, బ్యాంకు ఖాతాల్లోని నగదు తదితరాలను పరిశీలించారు.
ఈ క్రమంలో సుమారు రూ.1.25 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి పరిధిలోని ఓ హోటల్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ దుర్గాప్రసాద్ పట్టుబడిన ఘటన అనంతరం సీబీఐ అధికారులు ఆయన వ్యవహారాలపై దృష్టి సారించారు.
విచారణలో భాగంగా ఆస్తుల వివరాలను సేకరించిన అధికారులు.. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దుర్గాప్రసాద్ 2016లో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRRI)లో చేరారు.
అనంతరం డిప్యూటేషన్‌పై NHAIలోకి వచ్చి ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. లంచం కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. దుర్గాప్రసాద్‌కు సంబంధించిన ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులపై సీబీఐ అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
