Andhra Pradesh Rs 2 GO, Tribal Area Road Works
* ఆన్లైన్ బిల్లుల సమస్య పరిష్కారానికే నిర్ణయం
ఆకేరు న్యూస్, అమరావతి : గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన ఆన్లైన్ బిల్లుల చెల్లింపులో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రూ.2 మొత్తాన్ని విడుదల చేస్తూ జీవో జారీ చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పలు పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయా పనులకు సంబంధించిన బిల్లులను ఆన్లైన్ విధానంలో చెల్లించే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. దీంతో బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఈ సమస్యను పరిష్కరించే మార్గాలపై సాంకేతిక నిపుణుల సూచనలు తీసుకున్న అధికారులు.. వారి సూచనల మేరకు రూ.2 విడుదలకు సంబంధించిన జీవోను జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ మొత్తం విడుదల నిర్ణయం కేవలం ఆన్లైన్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకే తీసుకున్నట్లు అధికారులు వివరించారు.
రూ.2తో జీవో జారీ చేయడంపై వివిధ రకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు దీనిపై స్పష్టత ఇచ్చారు. ఇది సాధారణ నిధుల విడుదలకు సంబంధించిన నిర్ణయం కాదని.. బిల్లుల ఆన్లైన్ చెల్లింపుల్లో సాంకేతిక సమస్యను అధిగమించేందుకు నిపుణుల సూచనతో తీసుకున్న ప్రత్యేక చర్య మాత్రమేనని పేర్కొన్నారు.
ఈ జీవో ద్వారా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఏర్పడిన సాంకేతిక అవరోధాన్ని తొలగించి, చెల్లింపుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
