Kagaznagar
Kagaznagar: ఆకేరు న్యూస్, కుమ్రం భీం ఆసిఫాబాద్: బైక్ సర్వీసింగ్ కోసం వచ్చిన ఓ ద్విచక్ర వాహనంలో పెద్ద నాగుపాము కనిపించడంతో కాగజ్‌నగర్‌లో కలకలం రేగింది. బైక్ సీటు తొలగించగా పాము కనిపించడంతో మెకానిక్ భయంతో షాప్ నుంచి బయటకు పరుగులు తీశాడు.
బైక్‌లో దాక్కున్న పాము
కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ మెకానిక్ షాప్‌కు సర్వీసింగ్ కోసం బైక్ తీసుకొచ్చారు. సీటును తొలగించే సమయంలో దాని కింద దాక్కున్న నాగుపాము ఒక్కసారిగా బయటకు వచ్చి బుసలు కొట్టింది. దీంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు.
కొట్టి చంపిన స్థానికులు
పామును బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ అది బైక్ లోపలి భాగాల్లోకి దూరిపోయింది. పాములు పట్టేవారు అందుబాటులో లేకపోవడంతో చివరకు స్థానికులు నాగుపామును కొట్టి చంపారు. వర్షాలు, వాతావరణ మార్పుల సమయంలో పాములు వాహనాల్లోకి చేరే అవకాశం ఉన్నందున బైక్ లేదా కారును స్టార్ట్ చేసే ముందు ఒకసారి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
