ఎంపీడీవో వెంకట రమణారావు
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు (MPDO Venkata Ramana Rao) మృతదేహం తొమ్మిదిరోజుల తరువాత లభ్యమైంది. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన ఈనెల 15 నుంచి కనిపించడం లేదు. మధురానగర్ రైలు పై వంతెన నుంచి ఏలూరు కాలువలలోదూకినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ దిశగా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. 9 రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. నరసాపురం పరిధిలోని మాధవాయిపాలెం ఫెర్రీ పాటదారు ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల గురించి ఎంపీడీవో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు బకాయిల కోసం ఒత్తిళ్లు తీసుకురావద్దని ఇబ్బందులకు గురిచేయడంతోనే ఎంపీడీవో మనస్తాపానికి గురై కాలువతలో దూకారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
———————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
