Kakatiya University KU Exam Postponed
* పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు
ఆకేరు న్యూస్, వరంగల్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు భారీ వర్షాల ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని, వర్షాలు తగ్గే వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
