Harish Rao Defamation Case
* నేడు నాంపల్లి కోర్టుకు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నేడు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కోర్టుకు వెళ్లనున్న హరీశ్‌రావు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌పై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తన స్టేట్మెంట్ను నమోదు చేయించనున్నారు.
ఇటీవల పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, మరో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు తరఫు న్యాయవాది పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఇద్దరు నేతలు వ్యాఖ్యలు చేశారని హరీశ్‌రావు తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసులో భాగంగా హరీశ్‌రావు స్వయంగా కోర్టుకు హాజరై తన వాదనకు సంబంధించిన స్టేట్మెంట్ను ఇవ్వనున్నారు. అనంతరం కేసు తదుపరి విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. దీంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో నేడు జరగనున్న విచారణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
