SRR Foundation
SRR Foundation| ఆకేరు న్యూస్, రాయపర్తి: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. ప్రమాదాలు, అనారోగ్యంతో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులకు ఫౌండేషన్ ఆర్థికంగా, నిత్యావసర సరుకుల రూపంలో సహాయం అందిస్తోంది.
తిరుమలాయపల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించనున్న మహా అన్నదాన కార్యక్రమానికి ఫౌండేషన్ తరఫున 50 కిలోల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్ అందజేశారు.
కేశవాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దాసరి సత్యమ్మ కుటుంబాన్ని ఫౌండేషన్ ప్రతినిధులు పరామర్శించి, 50 కిలోల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్ అందించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రాయపర్తి మండలంలో ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. పేదల ఆకలి తీర్చడం, సామాజిక కార్యక్రమాలకు సహకరించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
