Raaka
* అక్టోబర్‌లో కొత్త షెడ్యూల్..
* ప్రధాన తారాగణంతో షూటింగ్
Raaka| ఆకేరు న్యూస్, డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా తాజా అప్డేట్స్ కోసం బన్నీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ముంబైలో కీలక షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం.
అక్టోబర్‌లో కొత్త షెడ్యూల్
తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ రెండో వారం నుంచి ‘రాకా’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్‌తో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొననున్నట్లు సమాచారం. ఇందులో కీలకమైన భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు టాక్.
భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. రాబోయే షెడ్యూల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
