NTR Trivikram Movie
NTR Trivikram Movie| ఆకేరు న్యూస్, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ చిత్రంపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రీ-ప్రొడక్షన్‌పై ఫోకస్
షూటింగ్‌కు ముందుగా దర్శకుడు త్రివిక్రమ్ ప్రీ-ప్రొడక్షన్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. కథ, స్క్రిప్ట్‌తో పాటు భారీ సెట్స్, విజువల్ డిజైన్, ఇతర సాంకేతిక అంశాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పౌరాణిక నేపథ్యానికి అనుగుణంగా సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
దేవుడి పాత్రలో ఎన్టీఆర్?
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో ఆయన పాల్గొంటారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ దేవుడి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు టాక్. అయితే ఎన్టీఆర్ పాత్ర, షూటింగ్ ప్రారంభ తేదీ వంటి వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
