UPI Charges
Published:
Updated: 28 Sep 2026 • 05:30 PM
UPI Charges| అకేరు న్యూస్, హైదరాబాద్: UPI వ్యాపార లావాదేవీలపై MDR విధించాలన్న కేంద్ర నిర్ణయానికి మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ ఛార్జీల విధానం, చట్టబద్ధతపై కేంద్ర ప్రభుత్వం, RBI, NPCI నుంచి వివరణ కోరింది. నాలుగు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
కొత్త విధానం ప్రకారం రూ.2,000కు మించిన కొన్ని వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తించనుంది. గరిష్ఠంగా రూ.300 వరకు ఛార్జీ ఉండనుంది. అయితే వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే UPI లావాదేవీలకు, రూ.2,000 వరకు ఉన్న వ్యాపార చెల్లింపులకు ఈ ఛార్జీలు వర్తించవు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
