MLA Naini Rajender Reddy
రాహుల్ గాంధీ చేపడుతున్న ఓటు చోరీ పోరాటానికి మద్దతుగా సోమవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. హార్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై స్వతంత్ర, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా ప్రతి దశలో పారదర్శకత ఉండాలని అన్నారు.
అనంతరం ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు, తొలగింపులపై విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున కలెక్టర్‌కు ఫిర్యాదు లేఖ అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
