Prajavani
Prajavani| ఆకేరు న్యూస్, హనుమకొండ: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌తో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీవో కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించారు. కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, అదనపు కలెక్టర్ రవి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను సత్వరం పరిష్కరించాలని సూచించారు.
గురుకుల హాస్టళ్లు, ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలను సంక్షేమ శాఖల అధికారులు త్వరగా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో నమోదుకు అర్హులైన పట్టభద్రులు, ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజావాణికి 309 అర్జీలు అందాయి. కలెక్టరేట్లో 136, హనుమకొండ, పరకాల ఆర్డీవో కార్యాలయాల్లో 38, ఎంపీడీవో కార్యాలయాల్లో 135 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శేషాద్రి, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహితే నేతతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
