Tamil Nadu
ఆకేరు న్యూస్, తమిళనాడు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే అర్హత కలిగిన శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించేలా తమిళనాడు ప్రభుత్వం ‘తైమామన్ థంగ మోతిరం పథకం’ను ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా ఏటా సుమారు 4.2 లక్షల నుంచి 4.4 లక్షల మంది శిశువులకు ప్రయోజనం చేకూరనుంది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 107 ప్రభుత్వ తల్లి-శిశు ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉంగరాలను పంపిణీ చేయనున్నారు.
ఒక్కో ఉంగరం 22 క్యారెట్ల బంగారంతో ఒక గ్రాము బరువుతో తయారు చేశారు. నాణ్యత, ప్రామాణికత కోసం BIS హాల్‌మార్క్‌తో పాటు ఆరు అంకెల HUID నంబర్‌ను ఉంగరాలపై ఉంచారు. భద్రమైన ప్యాకేజింగ్‌లో ఉంగరాలను ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
