Sarpatta Parambarai 2
Sarpatta Parambarai 2| ఆకేరు న్యూస్, సినిమా: తమిళ హీరో ఆర్య అభిమానులు ఎదురుచూస్తున్న ‘సర్పట్టా పరంబరై 2’ ఎట్టకేలకు సెట్స్‌పైకి వెళ్లింది. తొలి భాగం ప్రకటన వెలువడి మూడేళ్లు దాటిన తర్వాత సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన పా. రంజిత్‌నే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని ఆర్య సోమవారం ఎక్స్ వేదికగా కొత్త పోస్టర్‌తో వెల్లడించారు. బాక్సింగ్ రింగ్‌ను చూపించిన పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంటూ.. “ది ఆరిజిన్ ఆఫ్ సర్పట్టా పరంబరై బిగిన్స్” అని పేర్కొన్నారు. దర్శకుడు పా. రంజిత్‌తో పాటు తన భార్య, నటి సయేషాను కూడా ట్యాగ్ చేశారు.
మరోసారి నార్త్ చెన్నై బాక్సింగ్ ప్రపంచం నేపథ్యంలో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. ఆర్య–పా. రంజిత్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
