Rakul Preet Singh
Rakul Preet Singh: ఆకేరు న్యూస్, ముంబై: బాలీవుడ్ నటి రాకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన ప్రదేశాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలో మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. నిర్మాత వాషు భగ్నానీ, పనోరమా స్టూడియోస్‌కు సంబంధించిన ప్రదేశాలు కూడా ఈ తనిఖీల పరిధిలో ఉన్నట్లు పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
విదేశీ లావాదేవీలపై దృష్టి
సినిమా ప్రాజెక్టులు, షూటింగ్, విదేశీ డిస్ట్రిబ్యూషన్ పేరుతో నిధులను విదేశాలకు మళ్లించినట్లు వచ్చిన అనుమానాలపై ఐటీ శాఖ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అధికారులు పలు పత్రాలు, ఆర్థిక రికార్డులు, విదేశీ లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సోదాలకు సంబంధించి ఐటీ శాఖ నుంచి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన లేదా తుది నిర్ధారణ ఇప్పటివరకు వెలువడలేదు. సోదాలు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
రాకుల్ సోదరుడి పేరు గతంలో..
ఇదిలా ఉండగా, రాకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు 2025 డిసెంబర్లో డ్రగ్స్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో ప్రస్తావనకు వచ్చింది. డిసెంబర్ 19న జరిగిన పోలీసుల ఆపరేషన్‌లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అమన్‌పై ఆరోపణలు వచ్చినప్పటికీ, ప్రస్తుత ఐటీ సోదాలకు ఆ కేసుకు సంబంధం ఉందని అధికారికంగా వెల్లడించలేదు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
