Dharman Movie Shooting
* రాశీ ఖన్నా ఫిట్నెస్ పిక్ వైరల్
* మైసూర్లో ‘ధర్మన్’ షూటింగ్..
* తెల్లవారుజామునే వర్కౌట్స్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : సూపర్‌స్టార్ రజినీకాంత్, యువ హీరో రామ్ పోతినేనితో కలిసి దిగిన ఓ ఆసక్తికరమైన ఫొటోను హీరోయిన్ రాశీ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’ షూటింగ్లో ప్రస్తుతం ఈ ముగ్గురూ పాల్గొంటున్నారు. మైసూర్ షెడ్యూల్లోని విశేషాలను పంచుకుంటూ రాశీ ఖన్నా షేర్ చేసిన ఈ ఫిట్నెస్ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.
* అందరూ నిద్రలో ఉండగానే మా రోజు మొదలు..
జిమ్ దుస్తుల్లో రజినీకాంత్, రామ్‌తో కలిసి దిగిన ఫొటోకు రాశీ ఖన్నా సరదా క్యాప్షన్ ఇచ్చారు. “రజినీ సర్, రామ్‌లతో తెల్లవారుజామునే వర్కౌట్స్.. అసలు లోకమంతా నిద్రలేచే సమయం కంటే ముందే మా రోజు మొదలవుతుంది” అంటూ పేర్కొన్నారు.
షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ మైసూర్‌లోని ప్రముఖ ఆలయాలను సందర్శించడం, సరదాగా గడపడం, సెట్స్‌లో యునో గేమ్ ఆడుతూ సందడి చేయడం వంటి అనుభవాలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. అలాగే మైసూర్ ప్రసిద్ధ దోశను కూడా రాశీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
* ముగ్గురు స్టార్స్‌తో ‘ధర్మన్’పై ఆసక్తి..
ఈ పోస్ట్‌కు రాశీ ఖన్నా ‘#dharman’ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు రామ్ పోతినేని, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైసూర్ పరిసరాల్లో షూటింగ్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో ముగ్గురు కలిసి కనిపించిన ఈ ఫొటో సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
