Tanishaa Mukerji and Kajol
* లొనావాలా ఇంటికి విద్యుత్ కట్..
* భారీ బిల్లులు పంపి ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణ..
* సీఎం, అమిత్ షాను ట్యాగ్ చేస్తూ పోస్ట్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : బాలీవుడ్ నటి, కాజోల్ సోదరి తానిషా ముఖర్జీ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (MSEB)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుణెలోని లొనావాలాలో ఉన్న తమ పూర్వీకుల ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారని ఆమె ఆరోపించారు.
భారీ మొత్తంలో బిల్లులు పంపి, వాటిని చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేస్తూ విద్యుత్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు.
* ‘ఇది నేరం లాంటిదే’..
ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురిని ట్యాగ్ చేస్తూ తానిషా పోస్టు చేశారు. “లొనావాలాలో మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు మాఫియాలా వ్యవహరిస్తోంది.
భారీ బిల్లులు ఇచ్చి, చెల్లింపుల కోసం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఇది పూర్తిగా నేరం లాంటిదే. గడువు తేదీ రాకముందే శనివారం సాయంత్రం వచ్చి కరెంట్ కట్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు” అని ఆమె పేర్కొన్నారు.
‘లొనావాలాకు రండి’..
“@CMOMaharashtra @Dev_Fadnavis @myogiadityanath @AmitShah @TataPower.. దయచేసి లొనావాలాకు రండి. ఇక్కడ ఎలాంటి నియంత్రణ లేదు. వాళ్లు తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు” అని తానిషా తన పోస్టులో రాశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
