Land Resurvey
Land Resurvey| ఆకేరు న్యూస్, హనుమకొండ: భూములకు సంబంధించిన వివాదాలు, సమస్యలకు భవిష్యత్తులో తావులేకుండా భూ రీసర్వే నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి తెలిపారు. రీసర్వేలో భాగంగా రైతుల సమక్షంలో భూములను కొలిచి, వివరాలను కచ్చితంగా నమోదు చేస్తామని చెప్పారు.
ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామంలో భూ రీసర్వే ప్రక్రియపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూముల కొలతల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు అదనపు కలెక్టర్ ఎన్. రవి హాజరై రైతులకు రీసర్వే విధానం, దాని ఉద్దేశ్యాన్ని వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూముల హద్దులు, కొలతలు, ఇతర వివరాలను పక్కాగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే సమస్యలను తగ్గించవచ్చన్నారు. రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని, రైతుల సమక్షంలోనే కొలతలు చేపడతామని తెలిపారు.
రీసర్వే సమయంలో సర్వేయర్లకు రైతులు, గ్రామస్తులు సహకరించాలని అదనపు కలెక్టర్ కోరారు. తమ భూములకు సంబంధించిన వివరాలను రైతులు పరిశీలించడంతో పాటు, అధికారులు కోరిన సమాచారం, సహకారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎల్లస్వామి, హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ విక్రమ్ కుమార్, డీఐ సారంగపాణి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
