Jantar Mantar Protest
* భారీగా పోలీసుల మోహరింపు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వ్యవహార శైలికి వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
జంతర్ మంతర్ పరిసరాల్లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 163 అమలు చేస్తూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిరసనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జంతర్ మంతర్ వైపు వచ్చే మార్గాల్లోనూ నిఘా పెంచారు.
మరోవైపు, నిరసనలకు హాజరయ్యేందుకు వచ్చిన యువత మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా శాంతియుతంగా నిరసన చేపట్టి తీరుతామని చెబుతున్నారు. దీంతో జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
