IndiGo Flight Incident,
* ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :శంషాబాద్ నుంచి కడపకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్చల్ సృష్టించాడు. విమానం టేకాఫ్ అయ్యే సమయంలో అత్యవసర ద్వారం (ఎమర్జెన్సీ డోర్) తెరిచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
ప్రయాణికుడి చర్యను గుర్తించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని విమాన సిబ్బంది RGIA పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో విమానంలోని ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విమానంలో భద్రతా చర్యల్లో భాగంగా సిబ్బంది వెంటనే స్పందించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోలేదని సమాచారం. ఘటనపై RGIA పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ఎందుకు తెరిచేందుకు ప్రయత్నించాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
