Weapon Theft Case
* ఏడుగురు అరెస్ట్
Weapon Theft Case| అకేరు న్యూస్, డెస్క్: బొల్లారం ఆయుధాల చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ సుమతి వెల్లడించారు. ప్రధాన నిందితుడు మల్లేష్‌ను 10 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు తెలిపారు. అతడి నుంచి చోరీకి గురైన తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఆర్మీలో పనిచేసిన మల్లేష్
పోలీసుల వివరాల ప్రకారం.. మల్లేష్ 2010లో సిపాయిగా ఆర్మీలో చేరాడు. 2025లో సికింద్రాబాద్ రెజిమెంట్‌లో పోస్టింగ్ పొందాడు. అయితే మోకాలి గాయం కారణంగా అనంతరం సర్వీస్ నుంచి వైదొలిగినట్లు సీపీ తెలిపారు. మల్లేష్‌పై గతంలోనే రెండు చోరీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
గోల్డ్ షాపులు, బ్యాంకులే టార్గెట్
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మల్లేష్ చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గోల్డ్ షాపులు, బ్యాంకుల్లో చోరీలకు కూడా అతడు ప్రణాళికలు రూపొందించినట్లు సీపీ పేర్కొన్నారు. మల్లికార్జున, నిరంజన్‌తో కలిసి మల్లేష్ చోరీలకు స్కెచ్ వేసినట్లు వెల్లడించారు.
ఉగ్రకోణం లేదు
బొల్లారం ఆయుధాల చోరీ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదని సీపీ సుమతి స్పష్టం చేశారు. కేసులో అరెస్టయిన నిందితులను విచారిస్తున్నామని తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తామని సీపీ పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
