UNGA అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్
* 80 కోట్ల మంది భారతీయులకు విముక్తి
* యూఎన్జీఏ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్
ఆకేరు న్యూస్ డెస్క్ : సాంకేతిక విప్లవంతో భారతదేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం ద్వారా గత ఐదారేళ్లలో 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ (President Dennis Francis) వెల్లడించారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (Food and Agriculture Organization) (FAO) నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాకింగ్ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘డిజిటలైజేషన్ (Digitization) అనేది ఓ దేశం వేగవంతంగా అభివృద్ధి చెందేందుకు కారణం అవుతుంది. ఉదాహరణకు భారత్‌నే తీసుకోండి.. గత ఐదారేళ్లలోనే స్మార్ట్ఫోన్ల వాడకం ద్వారా 800 మిలియన్ల (80 కోట్ల మంది) మంది భారతీయులను పేదరికం నుంచి బయటపడేయగలిగింది. గతంలో భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉండేవి కావు. కానీ ఇప్పుడు గ్రామీణ రైతులు పేమెంట్స్ అందుకోవడం, బిల్లులు చెల్లించడం వంటివి స్మార్ట్‌ఫోన్ ద్వారానే చిటికెలో చేసేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసి, దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి భారత్‌లో ఇంటర్నెట్ వ్యాప్తి ఎంతగానో తోడ్పడుతోంది. మిగిలిన దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన వివరించారు.
——————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
