వరంగల్ ఖమ్మం హైవేపై రోడ్డు ప్రమాదం
Published:
Updated: 25 Oct 2026 • 04:28 PM
* టూవీలర్‌ను ఢీకొన్న లారీ
* వ్యక్తి అక్కడికక్కడే మృతి
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాళ్ల పద్మావతి కాలేజీ సమీపంలో టూవీలర్‌ను లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సదరు వ్యక్తి టూవీలర్‌పై రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో లారీ ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.

