మున్సిపల్ అధికారుల మార్కింగ్
* 60 అడుగుల రహదారిగా అభివృద్ధి
* ఇరువైపులా 30 అడుగుల చొప్పున మార్కింగ్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు విస్తరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని కొత్త గాంధీ బొమ్మ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా బస్టాండ్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణకు శనివారం మున్సిపల్ అధికారులు మార్కింగ్ ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న బీటీ రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 30 అడుగుల చొప్పున మొత్తం 60 అడుగుల రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న ప్రహరీ గోడలు, ఇళ్లు, మెట్లను తొలగించేందుకు అధికారులు మార్కింగ్ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా బస్టాండ్ వరకు ఈ రహదారి విస్తరణ చేపట్టనున్నారు. రోడ్డు విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ పనులకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
ఈ మార్కింగ్ కార్యక్రమంలో ఏఈ అనిల్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది లింగయ్య, సాయి తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

