Collector Chahat Bajpai
* భద్రతపై ప్రత్యేక దృష్టి
* చాహత్ బాజ్ పాయి పరిశీలన
ఆకేరు న్యూస్, హనుమకొండ : ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఈవీఎంల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి (Collector Chahat Bajpai) గురువారం సుబేదారి ప్రాంతంలోని రెడ్‌క్రాస్ సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) గోదాంను తనిఖీ చేశారు.
* సీసీ కెమెరాల పనితీరుపై ఆరా..
నెలవారీ తనిఖీల్లో భాగంగా చేపట్టిన ఈ పరిశీలనలో గోదాం ప్రధాన ద్వారానికి వేసిన సీల్స్‌ను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అనంతరం గోదాం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, పరిసరాల నిర్వహణ, సీసీటీవీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు.
* ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలి..
ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు కలెక్టర్ (Collector Chahat Bajpai) సూచించారు. గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని భద్రతా సిబ్బందికి ఆదేశించారు.
* అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఈవీఎంల భద్రత, గోదాం నిర్వహణలో నిర్దేశిత నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్‌తో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

