నిర్మాత సుప్రియ యార్లగడ్డ
* నవంబర్ 5 నుంచి ETV Winలో స్ట్రీమింగ్
* నిర్మాత సుప్రియ యార్లగడ్డ
ఆకేరు న్యూస్, సినిమా: పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య చిగురించే ప్రేమ, అనుబంధాలు, భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ రూపొందిన చిత్రం ‘బాలుగీత’. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ETV Winలో స్ట్రీమింగ్ కానుంది. సందీప్ సరోజ్, కేయురి జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించి సినిమా విశేషాలను వెల్లడించింది.
చిన్న సినిమా అయినప్పటికీ ఇందులో పెద్ద కథ ఉందని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. కథ విన్న వెంటనే సినిమాగా రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చాలామంది జీవితాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయని, అందుకే ఈ కథ ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. యువ ప్రతిభావంతులతో రూపొందించిన ఈ చిత్రంలో సందీప్, కేయురి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని ప్రశంసించారు. సినిమాను ఎంతో మనసుపెట్టి తెరకెక్కించామని, ప్రేక్షకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచదని ధీమా వ్యక్తం చేశారు.
పెళ్లి తర్వాత ప్రేమ ఎలా ఉంటుందంటే..
సాధారణంగా ప్రేమకథలు పెళ్లికి ముందు జరిగే ప్రేమ చుట్టూ తిరుగుతుంటాయి. కానీ ‘బాలుగీత’లో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న జంట మధ్య పెళ్లి తర్వాత మొదలయ్యే ప్రేమను చూపించామని దర్శకుడు ప్రతాప్ కొల్లారెడ్డి తెలిపారు. ఈ కథ రిలేషన్షిప్లో ఉన్నవారితో పాటు ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని పేర్కొన్నారు.
హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శకుడు ప్రతాప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సుప్రియ యార్లగడ్డ, నిహారిక కొణిదెల వంటి నిర్మాతల ప్రోత్సాహం ఆనందాన్నిచ్చిందన్నారు. సినిమా చూసిన తర్వాత జీవితంలో ఒక తోడు ఉంటే బాగుంటుందనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రైలర్‌పై నిహారిక ప్రశంసలు
ముఖ్య అతిథిగా హాజరైన నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘బాలుగీత’ ట్రైలర్ చూసినప్పుడు శేఖర్ కమ్ముల సినిమా చూసిన అనుభూతి కలిగిందన్నారు. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ETV Win కంటెంట్ హెడ్ భరణ్ సైతం సినిమా కథను, నటీనటుల ప్రతిభను ప్రశంసించారు. ఇందులో ఎన్నో ఆకట్టుకునే సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.
హీరోయిన్ కేయురి మాట్లాడుతూ.. ‘బాలుగీత’ అందరికీ కనెక్ట్ అయ్యే అందమైన ప్రేమకథ అని తెలిపారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పారు. సహ నిర్మాత హరీష్ కోహిర్కర్ మాట్లాడుతూ.. కథ విన్న ప్రతి ఒక్కరూ వెంటనే అంగీకరించారని, అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి సినిమా నిర్మించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.
సందీప్ సరోజ్, కేయురితో పాటు కృష్ణుడు, యశోరా, రిత్విక్, లోకేష్, ఎస్.ఎస్. కంచి, లహరి పరిచర్ల తదితరులు ఈ చిత్రంలో నటించారు. పెళ్లి తర్వాత ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో రూపొందిన ‘బాలుగీత’ నవంబర్ 5 నుంచి ETV Winలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఎలా అలరిస్తుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

