రామప్ప ఆలయంలో పూజలు చేస్తున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
* రామప్ప దేవాలయంలో..
* గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక పూజలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ములుగు జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రామప్ప దేవాలయానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు , భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు , గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ.వెంకటేశం, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ షభరిష్ తో కలిసి రామప్ప దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు గవర్నర్కు పూర్ణకుంభ ఘన స్వాగతం పలికారు. ఆయన రుద్రేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు గవర్నర్ ను పట్టు వస్త్రాలతో సత్కరించి, ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏటూరు నాగారం పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీవో సత్య పాల్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
