ఆకేరున్యూస్, హైదరాబాద్ : సికింద్రాబాద్ – నాగ్పూర్ మార్గంలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు పరుగు పెట్టనుంది. ఈ నెల 15న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇప్పడివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులు నడుస్తుండగా, వీటికి మరో వందే భారత్ తోడవనుంది. సికింద్రాబాద్ – నాగ్పూర్ మధ్య 578 కిలోమీటర్ల దూరాన్ని వందేభారత్ ఎక్స్ ప్రెస్ 7.15 గంటల్లో చేరుకోనుంది. వారంతో మంగళవారం మినహా ప్రతిరోజూ ఉదయం 5.గంటలకు నాగ్పూర్ లో బయల్దేరే వందే భారత్ మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి రాత్రి 8:20 గంటలకు నాగ్ పూర్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
