అవుట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిపై దాడి
ఘటనపై తీవ్రంగా స్పందించిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి


ఆకేరున్యూస్, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సుమలతపై యూనియన్ లీడర్ రాజమ్మ గొలుసుతో కట్టేసి దాడి చేసింది. ఎంజీఎంలో ఉద్యోగం ఇప్పిస్తే తనకు ప్రతినెలా డబ్బులు ఇవ్వాలని రాజమ్మ బాధితురాలు సుమలతకు కండిషన్ పెట్టింది. ఈ క్రమంలో తనకు
డబ్బులు ఇవ్వలేదని కోపంతో సుమలతపై దాడి చేసింది. ఈ ఘటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
