* నివాళులర్పించిన పలువురు ప్రముఖులు, నాయకులు
* భౌతిక కాయాన్ని ఎయిమ్స్ కు అప్పగించిన కుటుంబ సభ్యులు
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమ యాత్ర శనివారం ముగిసింది. ఉదయం ఢిల్లీ లోని ఆయన నివాసం నుంచి భౌతిక కాయాన్ని సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్ కు తరలించారు. అక్కడ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, బృందాకారత్, పినరయి విజయన్, ఎంఏ బేబి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఇతర పార్టీల నేతలు తదితరులు నివాళులర్పించారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళనాడు, అస్సాం, గుజరాత్, ఢిల్లీ, బీహార్, యూపీ నుంచి సీపీఎం నేతలు ఏచూరి ఆఖరు చూపు కోసం తరలి వచ్చారు. మధ్యాహ్నం 3.00 గంటలకు ఏకేజీ భవన్ నుంచి ఎయిమ్స్ వరకు అంతిమ యాత్ర కొనసాగింది. అక్కడికి చేరుకున్నాక ఏచూరి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు అప్పగించారు. కాగా, ఏచూరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీఆర్ ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, కమ్యూనిస్టు నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారావు, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ నివాళులు అర్పించారు.
——————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
