* బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకున్న ప్రభుత్వం
* ఎమ్మెల్యే క్వార్టర్స్, గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో మరణాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఆస్పత్రుల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ (BRS) నిజ నిర్ధారణ కమిటీ పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారి తీసింది. గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)కి బయలుదేరుతున్న మాజీ మంత్రి తాటికొండ రాజయ్య(Ex Minister Tatikonda Rajayya)ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజయ్యతో కూడిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో త్రిసభ్య కమిటీ ఈరోజు ఉదయం 11 గంటలకు గాంధీ దవాఖానను సందర్శించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్(Mla Quarters) వద్ద రాజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందే సభ్యుల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఓ బృందం గాంధీలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు, బీఆర్ ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు పలువురు నేతలను అరెస్ట్ చేశారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
