Employees Chalo Hyderabad Protest
* విజయవంతం చేయాలి – టీఎన్జీవో పాలకుర్తి యూనిట్ అధ్యక్షులు బక్క మహేష్
ఆకేరు న్యూస్, తొర్రూరు:
ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఈ నెల 10వ తారీకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం ముందు టీఎన్జీవో పాలకుర్తి యూనిట్ అధ్యక్షులు బక్క మహేష్ మరియు పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షులు రోండ్ల శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఉద్యోగులకు రావలసిన డిఏ బకాయిల విడుదల,పిఆర్సి అమలు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం, సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరించాలి అనేటువంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల హక్కుల కోసం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పాలకుర్తి యూనిట్ పరిధిలోని ఉద్యోగులు అందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ దేవేందర్, వరుణ్,అనురాధ,నాగరాజు,శరత్,సతీష్,రాజయ్య,అశోక్, రేణుక,శైలజ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
