* విద్వేష రాజకీయాలను ప్రేమతో ఎదుర్కొంటాం
* జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రధాని నరేంద్రమోదీ (Primeminister Narendramodi) పాలనలో కేవలం కొంత మంది కోటీశ్వరులే బాగుపడ్డారని, కోట్లాది మంది పేదలు అన్యాయానికి గురయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(RahulGandhi) విమర్శించారు. జమ్మూకశ్మీర్(Jammu Kasmir) ఎల్ ఓసీలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. విద్వేష రాజకీయాలను ప్రేమతో ఎదుర్కొ్ంటామని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ సర్కారు అన్యాయంగా కశ్మీర్‌ను యూటీ(Ut) చేసిందన్నారు. మోదీ పాలనలో ఉద్యోగాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, మేనిఫెస్టోలోని ఏడు అంశాలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
