* కేజీవ్రాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్న సీఎం
* సీఎం సీటు పక్కన సీటు వేసుకుని బాధ్యతలు
ఆకేరు న్యూస్, న్యూఢల్లీి: ఢల్లీి నూతన సీఎంగా ఆతిశీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్ అధినేత అరవింద్ కేజీవ్రాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ నాకు ప్రస్తుతం భరతుడికి ఎదురైన పరిస్థితే ఉంది. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు.. భరతుడు పాలించాల్సి వచ్చింది. సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి రాజ్యాన్ని ఏలాడు. ఈ కుర్చీ అరవింద్ కేజీవ్రాల్ది. నాలుగు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ఢల్లీిలో మళ్లీ ఆయన అధికారాన్ని చేపడతారని విశ్వసిస్తున్నానన్నారు. ఆయన తిరిగి వచ్చేవరకు ఈ కుర్చీ ఇక్కడే ఉంటుందని ఆతిశీ పేర్కొన్నారు. అతిషీతో పాటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అహ్లావత్, గోపాల్‌రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ కేబినెట్ మంత్రులు ప్రమాణం చేశారు.
……………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
