* మరో నాలుగు రోజులు వర్షాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో వాన దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy Rains) మొదలైంది. నగరమంతా మేఘావృతమై ఉంది. సికింద్రాబాద్(Secunderabad), బంజారాహిల్స్(Banjarahills), కోఠి, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, ఎస్సార్‌నగర్, పంజాగుట్ట(Panjagutta), నారాయణగూడ, ఆబిడ్స్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం పరుగులు పెడుతోంది. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సిబ్బందిని ఆదేశించారు. మరో నాలుగు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.
……………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
