Published:
Updated: 25 Sep 2024 • 09:11 AM
* అక్టోబర్ 16న విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఓటుకు నోటు ఈడీ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతుంది. మంగళవారం విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైర్హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు. నిందితుల గైర్హాజరుపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అలాగే నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
