* తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ సమంతా, నాగచైతన్యపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు. తనపై కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే విమర్శించాల్సి వచ్చిందని చెప్పారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదన్నారు. నా నుంచి అనుకోకుండా ఒక కుటుంబం పేరు వచ్చిందని.. ఆ కుటుంబం ట్వీట్ చూశాక చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానం మరొకరికి జరగొద్దనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని వెల్లడిరచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. లీగల్ నోటీసులపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలియజేశారు. అంతకు ముందే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సమంతకు ఎక్స్ వేదికగా మంత్రి కొండా సురేఖ తెలిపారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదని తెలిపారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు.’ అంటూ సురేఖ ట్వీట్ చేశారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
