* ముగ్గురు నిందితులు అరెస్ట్
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లాలో విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసున్నారు. వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన తాటి శివరాజ్ కుమార్ అలియాస్ జెట్టి, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కూచన మణిదీప్, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లిలోని బిట్స్ కళాశాల బీటెక్ విద్యార్థి కోడం వివేక్‌లు విద్యార్థినిని నమ్మించి హోటల్లో సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ వెల్లడిరచారు. ముగ్గురు నిందితులు లక్నెపల్లిలోని బిట్స్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు ఏసీపీ వివరాంచారు. నిందితులు వాడిన కారుతో పాటు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండకు తరలించినట్లు ఏసీపీ చెప్పారు.
……………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
