* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ధరణి పొర్టల్ను రద్దు చేసి త్వరలో ఆర్ఓఆర్ చట్టం తీసుకు వస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆర్ఓఆర్ చట్టాన్ని ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని వివరించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామని.. ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్స్‌ను గాలికి వదిలేసిందని.. పూర్తైన ఇండ్లను దసరా లోపు పేద ప్రజలకు అందజేస్తామని మంత్రి వెల్లడిరచారు.ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4 వేల ఇండ్లు మంజూరు చేస్తామని.. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో ప్రజలు కోరుకున్న వాటిని సాధించలేక పోయామని.. రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు సహా అన్ని పథకాలకు స్మార్ట్ కార్డుతో అనుసంధానం చేస్తామన్నారు. రాబోయే నాలుగేళ్లలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన ప్రతి పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు. జనవరి నుంచి ఆసరా పెన్షన్లు, సన్న బియ్యం పంపిణీ చేస్తామని.. రుణ మాఫీ కానీ రైతులకు 13 వేల కోట్ల రూపాయలతో త్వరలో విడుదల చేస్తామని ఆయన వెల్లడిరచారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
