ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావం తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లపై తీవ్రంగా ఉండనుందని వెల్లడించింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చేరువగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఇక రానున్న నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో ఆదిలాబాద్(Adilabad), నిర్మల్(Nirmal), నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్(Hyderabad), మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రేపు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్(Mahaboobnagar), నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
…………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
