* గన్‌పార్క్ వద్ద అభిమానుల నివాళి
* సాయంత్రం గాంధీ ఆస్పత్రికి భౌతికకాయం అప్పగింత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా (Professor Saibaba) భౌతికకాయానికి హైదరాబాద్‌లోని గన్‌పార్క్ (Gunpark) వద్ద అభిమానులు నివాళి అర్పించారు. ఉద్యమ సహచరుల సందర్శనార్థం అక్కడ కాసేపు ఉంచారు. అనంతరం మౌలాలి(Moulali)లోని నివాసానికి తరలించారు. జవహర్‌నగర్‌లోని శ్రీనివాస హైట్స్ నుంచి సాయిబాబా అంతిమయాత్ర ప్రారంభంకానుంది. ప్రొఫెసర్ సాయిబాబా కోరిక మేరకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి(Lv Prasad Hospital)కి కుటుంబసభ్యులు కళ్లను దానం చేశారు. అలాగే ఆయన భౌతికకాయాన్ని పరిశోధనల నిమిత్తం ఈరోజు సాయంత్రం గాంధీ మెడికల్ కాలేజీ(Gandhi Medical College)కి అప్పగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జన్మించిన సాయిబాబ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
……………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
