* విచారణకు ఆదేశించిన బీహార్ ప్రభుత్వం
ఆకేరు న్యూస్ డెస్క్ : బీహార్ (Bihar) రాష్ట్రంలో కల్తీ మద్యం కాటుకు 24 మంది మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. విచారణకు ఆదేశించింది. బిహార్ రాష్ట్రంలోని సరన్ (Saran), సివాన్ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు సంభవించాయి. సివాన్ (Siwan) జిల్లాలోనే ఏకంగా 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సివాన్ ఎస్పీ అమితేష్ కుమార్ తెలిపారు. దాదాపు 15 మంది అస్వస్థతకు గురి కాగా వారిని పాట్నాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చాప్రా ఎస్పీ కుమార్ ఆషిశ్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు సిట్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
