* చందానగర్‌లో విషాదం.. యువకుడి మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కుక్కను తరమబోయి.. హోటల్ మూడో అంతస్తు నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో చందానగర్(Chandanagar)లో విషాదం చోటుచేసుకుంది. రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో తెలినాలి యువకుడు ఉదయ్ (23) ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి ఆదివారం చందానగర్‌లోని వీవీ ప్రైడ్ హోటల్(VV Pride Hotel)లోకి వెళ్లాడు.
హోటల్ మూడో అంతస్తు బాల్కనీలో ఓ కుక్క(Dog) కనిపించడంతో దాన్ని తరమబోయాడు. అది మీదికి వస్తుండడంతో భయపడి తప్పించుకునే ప్రయత్నంలో భవనం కిటికీలోంచి కింద పడిపోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. సోమవారం సీసీ ఫుటేజీల ద్వారా విషయం బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
