* ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు
ఆకేరు న్యూస్, జగిత్యాల : జగిత్యాల(Jagithyala) జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు దారుణం హత్యకు గురయ్యాడు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు (Congress leader Ganga Reddy) గంగారెడ్డిని దుండగులు ఈరోజు ఉదయం తొలుత కారుతో ఢీకొట్టారు. కిందపడగానే కత్తులతో పొడిచి పొడిచి చంపేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిందెవరో ఆరా తీస్తున్నారు. విషయం తెలిసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevanreddy) జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి గంగారెడ్డి మృతదేహాన్ని సందర్శించారు. గంగారెడ్డిని చంపితే తనను కూడా హత్య చేసినట్లే అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టడంతో పట్టణంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
