ఆకేరున్యూస్, కమలాపూర్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి రానున్న వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి కలెక్టర్ పలు సలహాలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గ్రేయిన్ క్యాలిపర్ యంత్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఉమారాణి, డిఆర్డివో నాగ పద్మజ, తహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో బాబు, సివిల్ సప్లై డీటీలు నాగేంద్ర ప్రసాద్, రమేష్, ఇతర అధికారులతో పాటు రైతులు పాల్గొన్నారు.
…………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
