Balapur Ganesh Idol Cost
* ఏటా పెరుగుతున్న విగ్రహ తయారీ ఖర్చు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేశుడితో పాటు బాలాపూర్ బడా గణేశుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బాలాపూర్ గణేశ్ వేడుకలు, ముఖ్యంగా లడ్డూ వేలం, రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో విగ్రహ ఏర్పాట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
* రూ.3.20 లక్షలతో విగ్రహం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ బడా గణేశుడి 21 అడుగుల విగ్రహం తయారీ ఖర్చు ఈ ఏడాది రూ.3.20 లక్షలకు చేరింది. గతేడాది రూ.2.65 లక్షలు కాగా.. ఈసారి ఖర్చు మరింత పెరిగింది. బాలాపూర్‌కు చెందిన రైతు, పీపీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ పన్నాల పర్వతాల్‌రెడ్డి ప్రతి ఏడాది విగ్రహ తయారీ ఖర్చును పూర్తిగా భరిస్తున్నారు. ధూల్‌పేట్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన విగ్రహాన్ని పూరీ జగన్నాథ స్వామి ఆలయ నమూనాలో ఏర్పాటు చేసిన మండపానికి తీసుకొచ్చారు.
* ఉత్సవ సమితికి చెక్కు
విగ్రహ తయారీ ఖర్చుకు సంబంధించిన రూ.3.20 లక్షల చెక్కును పర్వతాల్‌రెడ్డి ఆదివారం బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులకు అందజేశారు. తాను లడ్డూ వేలంలో ఎప్పుడూ పాల్గొననని, విగ్రహ దానం ద్వారా మాత్రమే సేవ చేస్తున్నానని తెలిపారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవాలకు బాలాపూర్ కేంద్ర బిందువుగా ఉండటం ఆనందంగా ఉందని పేర్కొంటూ.. గణనాథుడి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
