* 163 సెక్షన్ అమలు
హైదరాబాద్: రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపధ్యంలో పోలీసులు సెక్రటేరియట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించి 163 సెక్షన్ విధించారు. శనివారం భార్యాపిల్లలతో రోడ్డెక్కిన కానిస్టేబుళ్లపై తెలంగాణ పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెటాలియన్లలో ఒకే రోజు 39 మందిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తమ సహోద్యోగులు సస్పెన్షన్ కు గురికావడంతో వారికి బెటాలియన్ కానిస్టేబుళ్లంతా బాసటగా నిలిచారు.
ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సస్పెన్షన్ను వెనక్కి తీసుకోవాలని బెటాలియన్ల ముట్టడి చేపట్టారు. గంటలకొద్దీ బెటాలియన్ ముఖద్వారం వద్ద నిరసన చేపట్టినా.. కమాండెంట్ పట్టించుకోకపోవడంతో పట్టరాని కోపంతో రోడ్డెక్కారు. అయినప్పటికీ సర్కారులో చలనం రాకపోవడంతోసోమవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్లు నగరానికి బయలుదేరినట్టు సమాచారం రాగా.. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
